'నాపేరు సూర్య' దర్శకుడు ఎక్కడంటే....??

Mari Sithara
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, గత ఏడాది మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా, ఆ అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ద్వారా, రచయిత వక్కంతం వంశి, తొలిసారి మెగా ఫోన్ పట్టడం జరిగింది. అయితే తొలి సినిమానే ఆయనకు పరాజయాన్నివ్వడంతో, తదుపరి సినిమా తప్పకుండా మంచి సక్సెస్ సాధించాలని ప్రస్తుతం ఒక మంచి కథను ఆయన చేస్తున్నట్లు సమాచారం. 

2002లో ఉదయ్ కిరణ్, ప్రత్యూష, గజాలల కలయికలో వచ్చిన కలుసుకోవాలని సినిమాకు రచయితగా పని చేసిన వంశీ, ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అశోక్, మహేష్ బాబు అతిథి, రవితేజ కిక్ మొదలుకుని ఇటీవల రవితేజ, రాశీఖన్నాల కలయికలో వచ్చిన టచ్ చేసి చూడు వరకు దాదాపుగా పదమూడు సినిమాలకు రచయితగా కథలు అందించడం జరిగింది. అయితే వాటిలో కొన్ని మంచి హిట్స్ సాధిస్తే, మరికొన్ని ఫ్లాప్స్ గా మిగిలాయి. నిజానికి వంశీ అందించే కథల్లో మంచి డెప్త్ ఉంటుందని, ఆయన కథను దర్శకుడు బాగా మనసుపెట్టి అర్ధం చేసుకుని, 

అదే ఫీల్ తో స్క్రీన్ పై ప్రెజెంట్ చేయగలిగితే, ఆ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని పలువురు దర్శకులు గతంలో వంశీ పై పొగడ్తలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే కెరీర్ మొదట్లో కల్యాణప్రాప్తిరస్తు అనే ఒక సినిమాలో వంశి హీరోగా నటించడం జరిగింది. కానీ ఆ తరువాత ఆయన నటనకు స్వస్తి చెప్పి రచయితగా మారారు. ఇక ప్రస్తుతం తన తదుపరి సినిమా కథ పై తీవ్రంగా కసరత్తు చేస్తున్న వంశీ, అతి త్వరలోనే దానిని తనకు మంచి పరిచయస్థుడైన ఒక స్టార్ హీరోకు వినిపించనున్నట్లు సమాచారం. మరి వంశీ తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఖచ్చితంగా తెలియాలంటే మాత్రం, మరికొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: