చిరంజీవి చరణ్ ల మధ్య ఘర్షణలను బయటపెట్టిన సుష్మిత !

Seetha Sailaja
‘సైరా’ మూవీకి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసిన సుష్మిత ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కున్న సమస్యలను రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజు తాను పడ్డ టెన్షన్ ను వివరిస్తూ ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. తాను పని ఒత్తిడికి ఎప్పుడూ లోను కాను అని చెపుతూ వారంలో 15 కాస్ట్యూమ్స్ రెడీ చేయమన్నా రాత్రి పగలు కష్టపడుతూ తాను ఆపని చేయగలను అని వివరించింది. 

అయితే ‘సైరా’ షూటింగ్ సమయంలో తాను పనిచేస్తున్నప్పుడు తనకు ఎదురైనా క్రియేటివ్ ఇగో లను హ్యాండిల్ చేయడం చాల కష్టంగా మారిందని కామెంట్స్ చేసింది. అంతేకాదు తనకు క్రియేటివ్ ఇగో ఉన్నప్పటికీ టీమ్ సభ్యుల కోసం తన ఇగోను సద్దుబాటు చేసుకుంటూ ఎదుటి వారికి నచ్చే విధంగా తాను తనపని చేయవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు తనకు అనేక సార్లు కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయని ఆసందర్భాలను గుర్తుకు చేసుకుంది. 

దీనితో ఈపనిని మధ్యలో వదిలేయాలని అనేక సార్లు అనిపించినా తన భర్త తనకు రోజు ఫోన్ చేస్తూ ‘కూల్ డౌన్ థింక్ పాజిటివ్’ అంటూ తనకు తరుచు స్పూర్తిని ఇవ్వడం వల్లనే తన పనిని పూర్తి చేయగలిగాను అని అంటోంది సుష్మిత. ఇదే సందర్భంలో ఈ మూవీ నిర్మాణ సమయంలో చరణ్ చిరంజీవిల మధ్య ఏర్పడిన క్రియేటివ్ భేదాభిప్రాయాలు ప్రొఫెషనల్ ఆర్గ్యుమెంట్స్ తనకు అనేక సార్లు సమస్యగా మారిన విషయాలను బయటపెట్టింది.

తండ్రికొడుకులుగా చిరంజీవి ఒక మాట చెపితే ఆ మాటను జవదాటని రామ్ చరణ్ నిర్మాతగా మటుకు అనేక సార్లు ఈమూవీ విషయాల పై ఏకంగా చిరంజీవితోనే వాదోపవాదాలు ఆడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అని అంటూ కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టింది. అటువంటి భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు చరణ్ తన దగ్గరకు వచ్చి ‘నాన్న ఎలాగైనా చేయాలి ఆయనను ఒప్పించు’ అని తనకు ఆర్డర్ వేయడంతో తను చిరంజీవి దగ్గరకు వెళ్లి ఆయన మూడ్ కు తగ్గట్టుగా ఆయనతో మాట్లాడి ఒప్పించడానికి తనకు చుక్కలు కనిపించాయి అంటూ సుష్మిత షాకింగ్ కామెంట్స్ చేసింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: