ఇంకా కెరియర్ లో ఒక్క హిట్టు పడని అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ ఎవరితో చేస్తాడన్న డిస్కషన్స్ మొదలయ్యాయి.
అఖిల్ ఐదో సినిమా ఆఫర్ ఓ యువ దర్శకుడు అందుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అ! తో ప్రతిభ చాటిన ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో అఖిల్ సినిమా ఉండబోతుందని అంటున్నారు. అ! తర్వాత కల్కి సినిమా చేసిన ప్రశాంత్ వర్మ మేకింగ్ పరంగా మంచి మార్కులే సంపాదించాడు. ఇక క్వీన్ రీమేక్ చేసినా అది తన ఎకౌంట్ లేకి రాదని ఫిక్స్ అయ్యాడు.
అయితే రీసెంట్ గా కాజల్ నిర్మాతగా ఆమె లీడ్ రోల్ లో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్ట్ ఎందుకో వాయిదా పడినట్టు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ.. నాగ చైతన్యకు ఓ కథ సిద్ధం చేశాడట. అయితే డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల చైతు ప్రశాంత్ వర్మ ఆఫర్ కాదనాల్సి వచ్చిందట. అయితే చైతుకి చెప్పిన కథనే అఖిల్ కోసం మార్చి రాశాడట.
బొమ్మరిల్లు భాస్కర్ సినిమాతోనే హిట్టు కొట్టాలన్న కసితో ఉన్న అఖిల్ ప్రశాంత్ వర్మ సినిమాతో కూడా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కు నిర్మాత ఎవరు. ఎలాంటి జానర్ లో ఈ సినిమా వస్తుందన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అఖిల్ 4వ సినిమా పూర్తయ్యే టైం కు ఈ సినిమా గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.