తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఎనిమిదవ వారం దాటింది..ఇంటి సభ్యులు ఒక్కో వారం ఎలిమినేట్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ మద్య కింగ్ నాగార్జున తన పుట్టిన రోజు వేడుకలకు కోసం స్పెయిన్ వెళ్లినపుడు శివగామి రమ్యకృష్ణ శని, ఆదివారం బిగ్ బాస్ ఇంటి సభ్యులను అలరించింది. ఆ రెండు రోజులు మాత్రం బిగ్ బాస్ 3 లో ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. అయితే వినాయక చవితి సందర్భంగా ఆ వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు.
ఇప్పటి వరకు బిగ్ బాస్ లో నటి హేమ, జాఫర్,తమన్నా,రోహిణి,అర్షు,అలీ రజా, హిమజా ఎలిమినేట్ అయ్యారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో హిమజ ఎలిమినేట్ కావడం పై కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వారం ఇంటి సభ్యులు ఎన్నో త్యాగాలు చేసుకుంటే..సేవ్ అయ్యారు. ఇక మహేష్ ని సేవ్ చేయడానికి హిమజ తన బట్టలు, మేకప్ కిట్ అన్ని త్యాగం చేయాలని చెబితే..ఆమె మాత్రం కొన్ని స్టోర్ రూమ్ లో పెట్టి మిగతావి మర్చిపోయింది. ఈ విషయం కెప్టెన్ అయిన వితిక బిగ్ బాస్ కి తెలియజేయడంతో మహేష్ సేవ్ కాలేక పోయాడు.
అయితే హిమజను రక్షించడానికి నటుడు వరుణ్ సందేష్ ఏకంగా పేడలో పడుకోవాల్సి వచ్చినా సంతోషంగా చేశాడు. ఇదే విషయం దృష్టిలో పెట్టుకొని కెప్టెన్ గా ఒకరిని ఎలిమినేట్ చేసే పవర్ బిగ్ బాస్ వితికకు ఇవ్వగా..హిమజను నామినేట్ చేసింది. అయితే తాను మాత్రం అన్నీ తీసుకు వెళ్లానని..కొన్ని అక్కడ ఉన్న విషయం తనకు తెలియని చెప్పినా..తప్పు తప్పే అని అటు మహేష్, ఇట్ హిమజ ఎలిమినేట్ కావడానికి కారణాలు అయ్యాయి. నిన్నటి ఎపిసోడ్ లో హిమజ బయటకు వచ్చిన తర్వాత ఆమె జర్నీ చూసి కన్నీరు పెట్టుకుంది. ఇంట్లో కొంత మంది సభ్యులు తనను ఇప్పటికీ అర్థం చేసుకోలేక పోయారని వాపోయింది.