రాబోతున్న సంక్రాంతి రేసుకు దూసుకు వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురంలో’ ఏమూవీ విజయం సాధిస్తుంది అన్న విషయం బట్టి సంక్రాంతి రేస్ విన్నర్ ని నిర్ణయిస్తారు. ఈ రెండు భారీ సినిమాల మధ్య గ్యాప్ ఉండేలా మహేష్ సినిమా జనవరి 10న విడుదల అయితే బన్నీ సినిమా జనవరి 12న విడుదల చేసుకోవడానికి ఈ మూవీల నిర్మాతలు ఇప్పటికే ఒక ప్రాధమిక అంగీకారానికి వచ్చారు.
అయితే ఇప్పుడు మహేష్ ముందుగా అల్లు అర్జున్ సినిమా వచ్చిన తరువాత తన మూవీని విడుదల చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలలో ఉన్నట్లు టాక్. ఇలాంటి ఆలోచనలు మహేష్ కు రావడం వెనుక ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది.
గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి రేసులో మొదటిగా వచ్చిన టాప్ హీరోల సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. దీనికి ఉదాహరణగా ఆయా సంవత్సరాల సంక్రాంతి రేస్ కు వచ్చిన ‘1 నేనొక్కడినే’ ‘అజ్ఞాతవాసి’ ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ మూవీలను ఉదాహరణగా చూపెడుతున్నారు.
దీనితో ఈ సెంటిమెంట్ గుర్తుకు వచ్చి మహేష్ బన్నీకి ముందుగా లైన్ క్లియర్ చేసి తాను ఆలస్యంగా రావడానికి అభ్యంతరం లేదు అంటూ రాయబారాలు పంపుతున్నట్లు టాక్. ఈ రాయబారాలలోని అసలు రహస్యాన్ని గ్రహించిన అల్లు అర్జున్ మాత్రం తాను సంక్రాంతి రేసులో ముందుగా రానని అనుకున్నట్లుగానే మహేష్ ను ఈ పండగ రేసును ప్రారంభించమని సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.దీనితో సంక్రాంతి బ్యాడ్ సెంటిమెంట్ వార్తలు విని మహేష్ భయపడి పోతున్నాడా అంటూ కొందరు జోక్స్ వేస్తున్నారు. అయితే ఒక సినిమా ఘన విజయం ఆ సినిమా కథను బట్టి ఉంటుంది కాని కేవలం సెంటిమెంట్ ను నమ్ముకుని సినిమాలకు సక్సస్ రాదు అన్న విషయం ఈ ఇద్దరి హీరోలకు తెలియదా అన్నదే సందేహం..