అదే జరిగితే అసలు దాచిపెట్టను.. ఆ ఒక్క విషయంలో తప్ప..!

shami
బాలీవుడ్ హీరోయిన్స్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అయితే అక్కడ స్టార్ క్రేజ్ సంపాదించిన భామలు సౌత్ సినిమాల్లో నటించాలంటే మాత్రం భారీ రెమ్యునరేషన్ కోరుతారు. అయితే అక్కడ ఇక్కడ ఒకేసారి కెరియర్ మొదలు పెట్టిన భామలైతే సౌత్ సినిమాలను చేస్తుంటారు. లేటెస్ట్ గా తెలుగులో హిందిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న భామ కియర అద్వాని.


బాలీవుడ్ లస్ట్ స్టోరీస్ లో నటించిన ఈ అమ్మడు సినిమాలను కూడా చేస్తుంది. తెలుగులో భరత్ అనే నేను హిట్ అందుకున్న కియరా అద్వాని ఆ తర్వాత వచ్చిన వినయ విధేయ రామ సినిమాతో ఫ్లాప్ అందుకుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో సూపర్ హిట్ అందుకున్న కియరా బాలీవుడ్ హీరోతో డేటింగ్ లో ఉందన్న వార్తలు వస్తున్నాయి.  


ప్రేమ, పెళ్లి మీద తనకు గౌరవం ఉందని తాను ఓ హీరోని ప్రేమిస్తున్నా అంటూ వచ్చిన వార్త్రల్లో ఎలాంటి నిజం లేదని చెబుతుంది కియరా అద్వాని. కలిసి నటించినంత మాత్రాన ప్రేమించినట్టు ఎలా అవుతుందని అంటుంది కియరా. అంతేకాదు తను ప్రేమించడం మొదలు పెడితే ఆ విషయాన్ని తాను వెంటనే అందరికి చెబుతా అంటుంది.


ఇక తన మీద వస్తున్న రూమర్స్ కు తాను అసలు కోప్పడనని చెబుతుంది కియరా. కేవలం తనకు ఆకలి అయినప్పుడు మాత్రమే కోపం వస్తుందని.. మిగతా టైం లో అసలు కోపం రాదని చెబుతుంది ఈ అమ్మడు. తెలుగు, హింది సినిమాల్లో మంచి ఫాం లో ఉన్న కియరా అద్వాని కోలీవుడ్ లో కూడా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా కియరా వరుస సినిమాలతో బిజీగా ఉంది.  మహేష్ తన తర్వాత సినిమాలో హీరోయిన్ గా మళ్లీ కియరానే రికమెండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: