హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ పునర్నవి పొగరు దించేసాడు రవికృష్ణ..?
ఇదిలా ఉండగా ఆదివారం జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో శ్రీముఖి బాబా భాస్కర్, రవి కృష్ణ మిగిలి ఉన్నారు. శనివారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వరుణ్ సందేశ్ సేవ్ అయ్యారు. అయితే చివరగా మిగిలిన ముగ్గురు సభ్యులు శ్రీముఖి, బాబా భాస్కర్, రవి కృష్ణ ల మధ్య ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రక్రియ చాలా ఉత్కంఠభరితంగా ప్రేక్షకులను మైమరిపించే విధంగా జరగటం విశేషం. ముందుగా ఈ ప్రక్రియలో శ్రీముఖి సేవ్ అయినట్లు యాంకర్ నాగార్జున ప్రకటించడంతో హౌస్ నుండి బాబా భాస్కర్- రవికృష్ణ ల మధ్య ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ఇంటి సభ్యుల మధ్య టెన్షన్ నెలకొంది. ఈ లోపు యాంకర్ నాగార్జున రవికృష్ణ ఎలిమినేట్ అవుతున్నట్టు ప్రకటించడంతో బాబా భాస్కర్ మాస్టర్ సేవ్ అవడం జరిగింది.
అయితే హరికృష్ణ చాలా తీవ్రమైన భావోద్వేగంతో బిగ్ బాస్ హౌస్ విడిచారు. అయితే బిగ్ బాస్ హౌస్ విడిచాక యాంకర్ నాగార్జునతో వేదిక పంచుకున్న రవికృష్ణ బిగ్ బాస్ హౌస్ ఇంటి సభ్యుల గురించి అనేక విషయాలు చెబుతూ సలహాలు ఇస్తూ వెళ్తూ వెళ్తూ పునర్నవి పై బిగ్ బాంబ్ వేశాడు. అదేమిటంటే వారం మొత్తం ఇంటిలో ఉన్న హౌస్ మేట్ సభ్యుల బట్టలు ఉతకడం. దీంతో రవి కృష్ణ పునర్నవి పై వేసిన బిగ్ బాంబ్ గురించి సోషల్ మీడియాలో బిగ్ బాస్ అభిమానులు నెటిజన్లు...రవి కృష్ణ ఇంటి నుండి వెళ్తూ వెళ్తూ పునర్నవి పొగరు దించేశాడు అని కామెంట్లు పెడుతున్నారు.