మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథను తెర మీదకు తీసుకు రావాలన్న ప్రయత్నం మొదలు పెట్టింది పరుచూరి సోదరులే. దాదాపు 10, 12 ఏళ్ల క్రితమే నరసింహా రెడ్డి సినిమాకు కథ రాసుకున్నారు. అయితే అప్పుడనుకున్న కథ ఇప్పుడు తెరకెక్కిన సైరా ఒకటే కాదని ఫిల్మ్ నగర్ టాక్.
పదేళ్ల క్రితం పరుచూరి బ్రదర్స్ సైరా కథ రాసుకున్న మాట వాస్తవమే.. టైటిల్స్ లో మూల కథగా వారికి అగ్ర తాంబూలం ఇచ్చినా డైరక్టర్ సురేందర్ రెడ్డి అండ్ టీం చేసిన రీసెర్చ్ వల్లనే సైరా సినిమా గొప్పగా వచ్చిందన్న టాక్ ఉంది. అందుకే కేవలం పరుచూరి బ్రదర్స్ కథని పక్కకు పెట్టారని తెలుస్తుంది.
పరుచూరి బ్రదర్స్ కూడా సైరా మీద ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. సినిమా కథ విషయంలో సురేందర్ రెడ్డి అండ్ టీం ఎక్కువ కష్టపడ్డారట. అంతేకాదు సినిమా డైలాగ్స్ కూడా సాయి మాధవ్ బుర్రా అదరగొట్టేశాడని తెలుస్తుంది. సినిమాకు బలమైన సీన్స్ చాలా ఉన్నాయని అయితే ప్రమోషన్స్ లో వాటి గురించి లీక్ చేసి అంచనాలు పెంచకుండా సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నారట.
పరుచూరి సోదరులు రాసిన కథను సూరి డెవలప్ చేశాడా లేక సురేందర్ రెడ్డి మొత్తానికే కొత్త కథ రాసుకున్నాడా అన్నది చూడాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పరుచూరి సోదరుల్లో పెద్దవాడైన పరుచూరి వెంకటేశ్వర్ రావు మాత్రమే వచ్చారు. సినిమా కథను మార్చినందుకు బ్రదర్స్ హర్ట్ అయ్యారని అందుకే పరుచూరి గోపాల కృష్ణ రాలేదని ఓ టాక్. ఏది ఏమైనా సైరా రేపు థియేటర్ లో సందడి చేయనుంది. సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.