డిసెంబర్ లో అరడజను సినిమాలతో టాలీవుడ్ సందడి..

satvika
టాలీవుడ్ సినిమా ప్రపంచంలో సినిమాలకు కొరత ఉండదు.. ఎప్పుడు కొత్త కొత్త సినిమాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అలా వెంట వెంటనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పండగల సమయంలో అయితే, సినిమాల దూకుడు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఒక్కో పండుగ వస్తుందంటే.. సినిమాలలో కూడా పండుగ వాతావరణం నెలకొంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 


వస్తున్నా సంక్రాంతికి పెద్ద సినిమాల హవా నడుస్తుండంతో పండుగ రోజుల్లో ఉన్న డేట్స్ కోసం అన్ని సినిమాలు ఆ డేట్ నేను అని పోటీపడుతున్నాయి. కొన్ని పెద్ద సినిమాలు ముందు నెలలో డిసెంబర్ లో రిలీజ్ అవుతున్నాయి. ఆ నెలలో ఏకంగా ఆరు సినిమాలు బరిలో దిగనున్నాయి. అవి కూడా పెద్ద హీరోల సినిమాలే కావడం విశేషం. 


డిసెంబర్ నెలలో ముందుగా నాగచైతన్య, విక్టరీ వెంకీ నటిస్తున్న వెంకీ మామ సినిమా బరిలోకి దిగనుంది. ఈ ఇద్దరు హీరోలు గా మొదటి సారి నటించిన ఈ సినిమా ఫస్ట్ టైం రిలీజ్ కాబోతుంది. ముందుగా ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలనుకున్న కూడా కొన్ని కారణాల వాళ్ళ ఆ సినిమా డిసెంబర్ కు వెళ్ళింది. 



చాలా కాలం హిట్ ఎన్ని బాలయ్య ప్రస్తుతం నటించిన చిత్రం రూలర్.. ఆ సినిమాలో బాలయ్యలో కొత్త లుక్ తో వస్తున్నాడు. ఆ సినిమాకు కూడా సంక్రాంతికి కి రిలీజ్ చేస్తే అతనికి కలిసి వస్తుందని అనుకున్న ఆ సినిమా కూడా కొన్ని కారణాల వల్ల డిసెంబర్ లో రిలీజ్ కు సిద్దమైయింది. ఇకపోతే మాస్ మహారాజ రవితేజ కు చాలా కాలం నుండి అన్ని ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి. దానితో ఆయన నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా డిస్కో రాజా కూడా డిసెంబర్ లో రానుంది. 



విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా బ్రేకప్ వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా కూడా ఈ డిసెంబర్ లో రిలీజ్ కానుంది. డియర్ కామ్రేడ్ ప్లాప్‌తో బాధలో ఉన్న  విజయ్ దేవరకొండ ఈ సినిమా పై మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా అర్జున్ రెడ్డి తరహానే ఇంటెన్స్ లవ్ స్టోరీ అంటున్నారు. షూటింగ్ పూర్తి అవ్వలేదు కానీ రిలీజ్ అవ్వబోతుందని సమాచారం..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: