బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఫీటప్ విత్ స్టార్స్ షోని టాలీవుడ్ కు వచ్చేలా చేశారు. ప్రస్తుతం వూట్ యాప్ లో వస్తున్న ఈ షో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. సిని తారల బెడ్ టైం సీక్రెట్స్ ను బయట పెట్టడమే ఈ షో కాన్సెప్ట్. అంతేకాదు సినిమా షూటింగ్ టైంలో వారు పొందిన అసౌకర్యం గురించి కూడా ఈ షోలో వస్తుంది.
మంచు లక్ష్మి హోస్ట్ గా రన్ అవుతున్న ఈ షోలో లేటెస్ట్ గా రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొన్నది. తన బెడ్ రూం సీక్రెట్స్ తక్కువ రివీల్ చేసిన రకుల్ ఓ హీరోతో తనకు కలిగిన అసౌకర్యాన్ని బయట పెట్టింది. ఓ హీరోతో సాంగ్ లో రొమాన్స్ చేస్తున్నప్పుడు ఆ హీరో చెమట కంపు భరించలేకపోయానని చెప్పింది రకుల్.
ఆ చెమట కంపు భరించలేక తను ఎక్కువగా ఫెర్ ఫ్యూం కొట్టుకున్నానని చెప్పుకొచ్చింది. ఆ హీరోకి ఆ విషయం చెప్పేందుకు తాను చాలా కష్టపడ్డానని అన్నది రకుల్. రకుల్ కు చెమట కంపు కలిగించిన హీరో ఎవరన్నది చెప్పడానికి రకుల్ నిరాకరించింది. అయితే ఈ విషయాన్ని ఆల్రెడీ నీతో ప్రస్థావించానని మంచు లక్ష్మిని అడుగగా ఇందులో నన్ను ఇన్వాల్వ్ చెయూద్దని తప్పుకుంది మంచు లక్ష్మి.
ఇప్పటికే సెలబ్రిటీస్ తో చేస్తున్న ఈ షో త్వరలోనే ఓ ఛానెల్ తో టై అప్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. సినిమాలతోనే కాదు ఇలాంటి షోల ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు సెలబ్రిటీస్. రకుల్ తో మంచు లక్ష్మి ఎపిసోడ్ క్రేజీగా సాగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగులో కొద్దిగా ఫాం కోల్పోయినట్టు కనిపిస్తున్న రకుల్ మళ్లీ వరుస అవకాశాలను అందుకోవాలని చూస్తుంది.