మెగా హీరో వరుణ్ తేజ్ కెరియర్ మొదటి నుండి వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటున్నాడు. ఆయన నటించిన " కంచె" సినిమా రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా లో సైనికుడి పాత్ర లో కనిపించారు. వరుణ్ అంతరిక్షం 9000 KMPH సినిమాలో వ్యోమగామి గా కనిపించారు. ఈ రెండు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
గత రెండు సంవత్సరాలుగా వరుణ్ తేజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆయన నటించిన ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2 సినిమాలు మంచి విజయం సాధించాయి. ఎఫ్ 2 సినిమా సంక్రాంతి కి వచ్చి మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా లో వరుణ్ తేజ్ విక్టరి వెంకటేష్ లు కలిసి నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే హాస్య సన్నివేశాలు అందరిని చాలా బాగా అలరించాయి. ఈ సినిమా దాదాపు గా 100 కోట్ల వసూళ్లు సాధించింది. రీసెంట్ గా వరుణ్ తేజ్ విలన్ గా నటించిన గద్దలకొండ గణేష్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. గద్దలకొండ గణేష్ పాత్ర లో ఆయన చేసిన నటన మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
వరుణ్ తేజ్ త్వరలో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేయబోతున్నడట. మొదటిది కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ కు ఓకే చెప్పాడట. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ నేపథ్యంలో సాగుతుందని టాక్. స్పోర్ట్స్ డ్రామా లో నటించడం వరుణ్ కెరియర్ లో ఇదే మొదటి సారి. రెండోది దర్శకుడు వెంకీ అట్లూరి తో ఒక సినిమా చేయబోతున్నడట. ఈ సినిమా ని దిల్ రాజు నిర్మించనున్నాడట. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలిప్రేమ సినిమా మంచి విజయం సాధించింది.ఈ విషయాలపై అధికారిక ప్రకటన చేయలేదు.