వరస ఫ్లాపులతో కష్టపడిన యువ హీరో సందీప్ కిషన్ ఇటీవల 'నిను వీడని నీడను నేనే' చిత్రం విజయం సాధించాడు. విజయం సాధించడంతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఈ సినిమాను స్వయంగా సందీప్ కిషన్ నిర్మించడంతో మొదటి సారి ప్రయత్నంలోనే నిర్మాతగా కూడా గణ విజయం దక్కింది. ఇది ఇలా ఉండగా సందీప్ కిషన్ నటించబోయే సరి కొత్త సినిమా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. సందీప్ కిషన్ తెలుగులో వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్, బీరువా లాంటి సినిమాలు తీశారు.
ఈ ప్రీ లుక్ పోస్టర్ లో ఒక స్టేడియం లో సందీప్ హాకీ స్టిక్ ను పట్టుకుని నిలుచున్నాడు. 'A1 ఎక్స్ ప్రెస్' టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రకథకు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ను ఎంపిక చేసుకున్నారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కే మొదటి తెలుగు సినిమా ఇదేనని అంటున్నారు అందరు. A1 ఎక్స్ ప్రెస్ టైటిల్ లోగోలో కూడా హాకీ గేమ్ ఆడుతున్న ప్లేయర్ బొమ్మ షాడోలా ఉంది.
ఈ సినిమాకు డెన్నిస్ జీవన్ కనుకొల దర్శకత్వం వహిస్తున్నారు. డెన్నిస్ జీవన్ కు గతంలో షార్ట్ ఫిలిమ్స్ కు దర్శకత్వంగా చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. అభిషేక్ ఆగర్వాల్ ఆర్ట్స్.. వెంకటాద్రి టాకీస్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు చిత్ర యూనిట్.
ఈ సినిమాకి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్రారంభం అయిందని.. త్వరలోనే హీరోయిన్.. ఇతర నటీనటులను ఫైనలైజ్ చేస్తారని సమాచారం ఉంది. నవంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. మరి ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాతో సందీప్ కిషన్ మరో హిట్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి మరి.ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.