'ఆర్ఆర్ఆర్' టైటిల్ ఇదేనా ?
రాజమౌళి తాను డైరెక్ట్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు టైటిల్ పెట్టే బాధ్యతను ప్రేక్షకులకే అప్పగించారు. దీంతో ఔత్సాహికులు చాలామంది తమకు తోచిన పేర్లను సజెస్ట్ చేశారు. అన్నిటినీ పరిశీలించిన రాజమౌళి అండ్ టీమ్ చివరికి ఒక పేరును బలంగా పరిశీలిస్తున్నారని టాక్. అదే 'రామ రాజ రౌద్రం'. ఈ పేరే ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయట. ఇక ఇతర భాషల కోసం 'రైజ్ రివొల్ట్ రివెంజ్' అనే టైటిల్ పెడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి.
ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ పాత్ర చేస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. 'బాహుబలి' సిరీస్ తర్వాత జక్కన్న నుండి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికీ మొదటి హీరోయిన్ గా ఓ విదేశీ భామను ఫైనల్ చేశాడు రాజమౌళి. అయితే ఆమె గురించి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట. ఆ పాత్రలోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది.