అల్లు అర్జున్ ఇచ్చిన షాక్ కు సై అన్న మహేష్ !

Seetha Sailaja
గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు జరగని సంఘటన రాబోతున్న సంక్రాంతి రేసుకు జరగబోతోంది. ఇప్పటి వరకు మ్యూజికల్ చైర్స్ గేమ్ ఆడిన మహేష్ అల్లు అర్జున్ లు తమ సినిమాల డేట్స్ ను అధికారికంగా ప్రకటించడమే కాకుండా ఈ రెండు సినిమాలు జనవరి 12న ఒకేరోజు విడుదల అవ్వడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.

సంక్రాంతి రేసులో టాప్ హీరోలు పోటీ పడటం సాధారణ విషయమే అయినా ఏకంగా ఒకేరోజు ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అలా వైకుంఠపురంలో’ ఒక దాని పై ఒకటి దాడి చేసుకుంటూ విడుదల కావడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది.సాధారణంగా టాప్ హీరోల సినిమాలను ఓపెనింగ్ కలక్షన్స్ కోసం అత్యధిక ధియేటర్లలో విడుదల చేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఈ రెండు సినిమాలు విడుదల అవ్వడంతో ధియేటర్ల విషయమై కూడ విపరీతమైన పోటీ ఏర్పడి ఈ మూవీ ఓపెనింగ్ కలక్షన్స్ ను చాల ఎక్కువగా ప్రభావితం చేసే ఆస్కారం ఉంది. దీనికితోడు ఈ ఇద్దరి టాప్ హీరోలకు ఎంతమంది అభిమానులు ఉంటారో అదే స్థాయిలో వీరిద్దరికీ యాంటీ ఫ్యాన్స్ కూడ ఉన్నారు. దీనితో ఒకేరోజు విడుదల అవుతున్న ఈ రెండు సినిమాల పై పోటా పోటీగా నెగిటివ్ ప్రచారం జరిగే ఆస్కారం కూడా ఉంది. 

ఈ రెండు సినిమాలకు దర్శకులుగా వ్యవహరిస్తున్న త్రివిక్రమ్ అనీల్ రావిపూడిలకు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఇలా ఒకేరోజు పోటీగా విడుదలైన రెండు భారీ సినిమాలలో ఎదో ఒకటి సక్సస్ అవుతుంది కానీ మరొకటి ఫెయిల్ అయిన సంఘటనలు గతంలో అనేక సార్లు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఉన్నాయి. దీనితో ఇవన్నీ తెలిసి కూడ మహేష్ బన్నీలు ఒకేరోజు ఒకరి పై ఒకరు సై అంటే సై అని అంటున్నారో అర్ధంగాని ప్రశ్నగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: