ఒకరంగంలో రాణించి ఆరంగంలో రిటైర్ అయ్యి.. అదే రంగానికి సంబంధించిన వివిధ అంశాల్లో రాణిస్తున్న చాలామంది ఇప్పుడు మిగతా రంగాలవైపు కూడా చూస్తున్నారు. వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెడుతూనే..సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ తమిళ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్నాడు. సినిమా రంగం నుంచి బహిష్కరించబడిన తరువాత సినిమా రంగంలో అనేక సినిమాలు చేశారు.
ఇప్పుడు విలన్ గా మారి సినిమా చేస్తున్నాడు. రియాలిటీ షోలో కూడా శ్రీశాంత్ రాణించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె, ఇప్పుడు శ్రీశాంత్ బాటలో ఇండియన్ స్వింగ్ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు. ఒకవైపు సేవలు అందిస్తూనే మరోవైపు ఝలక్ ధిక్ లాజా రియాలిటీ షో చేశారు. కాగా, ఇప్పుడు ఈ క్రికెటర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
అది మాములు ఎంట్రీ కాదు. విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సౌత్ స్టార్ హీరో విక్రమ్ హీరోగా విక్రమ్ 58 వ సినిమా తెరకెక్కబోతున్నది. దీనికి సంబంధించిన న్యూస్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. కాగా, ఇందులో విక్రమ్ హీరో అయితే, విలన్ గా ఇర్ఫాన్ పఠాన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మిగతా పూర్తి వివరాలు త్వరలోనే వెలువడబోతున్నాయి. క్రికెట్ లో రాణించిన వ్యక్తులకు సినిమా రంగం స్వాగతం పలుకుతున్న సంగతి తెలిసిందే.
అటు సచిన్ టెండూల్కర్ కూడా సినిమా రంగం తరువాత తన బయోపిక్ లో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. వీరే కాదు మరికొంతమంది క్రికెటర్లు కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇది నిజంగా మంచి విషయమని చెప్పాలి. మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తులు అన్ని వివిధ రంగాల్లో రాణిస్తారు అని చెప్పేందుకు ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇర్ఫాన్ వచ్చాడు.. త్వరలో ఇంకెంతమంది వస్తారో చూడాలి.