బాలయ్య కొత్త సినిమా టైటిల్ ను రివీల్ చేసిన ప్రముఖ ఛానెల్
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రంలో బాలయ్య కు జోడిగా సోనాల్ చౌహన్ , వేదిక నటిస్తుండగా సీనియర్ నటి భూమిక చావ్లా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. రూలర్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో భూమిక కనిపించనుందట. ఆమె పాత్రా సినిమా కు కీలకం కానుంది. సీకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు . ఇక కె ఎస్ రవి కుమార్ , బాలకృష్ణ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన 'జై సింహ' గత ఏడాది జనవరిలో విడుదలై మంచి వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది.