వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
ఈ రైడ్ లో ముగ్గురు మహిళలు ఇద్దరు యువతులను మరియు అదే విధంగా ఒక విటుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో శ్రీరెడ్డి మధ్యలో కలుగజేసుకొని, వ్యభిచారం అనేది ఒక సమాజ సేవ లాంటిది అని, అక్కడితో ఆగకుండా వేశ్యల్ని దేవతలతో పోలుస్తూ పేస్ బుక్ ద్వారా ఒక దారుణమైన పోస్టు పెట్టింది శ్రీరెడ్డి. “వేశ్యలు అనేవాళ్లు లేకపోతే.. మీ చిన్నారి కూతుళ్లకు భద్రత లేదు. వాళ్లని ఆ పని చేయనీయండి.
కనీసం మగాళ్లు జంతువులుగా మారకుండా ఉంటారు. వేశ్యలంటే దేవతలు. ఎందుకంటే వాళ్లు ఈ రకంగా సామాజిక సేవ చేస్తున్నారు. ఒకవేళ ఈ వేశ్యలే లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్ని ఈ మగాళ్లు రేప్ చేస్తారు” అంటూ తన పోస్టు ద్వారా హెచ్చరించింది శ్రీరెడ్డి. అంతే కాకుండా వ్యభిచారం చేస్తున్న మహిళలు మరియు మగవాళ్ళు ఆనందంగానే ఉన్నారు కదా మీరు ఎందుకు వారిని బాధ పెడుతున్నారు అంటు పోలీసుల పై ప్రశ్నల వర్షం కురిపించింది శ్రీ రెడ్డి.