తెలుగు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన మూవీ ‘రక్త చరిత్ర’ అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల రవి జీవిత కథ నేపథ్యంలో వివేక్ ఒబెరాయ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది రాధికా ఆప్టె. ఈ సినిమా సూపర్ హిట్ అందుకున్న తర్వాత తెలుగు నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్ సినిమాల్లో నటించింది.
తర్వాత ఒకటీ రెండు సినిమాల్లో నటించినా తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ పలు సినిమాల్లో నటించింది..తర్వాత తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘కబాలి’ సినిమాతో ఛాన్స్ కొట్టింది. ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే రాధికా ఆప్టే అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. తాజాగా 2012లో బ్రిటీష్ సంగీత కళాకారుడు టేలర్‌ను వివాహం చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే ఈమధ్య తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.
ఒకవేళ పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్‌గా నటించేందుకు కూడా రెడీ అంటోంది. ఆ మద్య టాప్ లెస్ గా కనిపించి సంచలనం సృష్టించింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లతోనూ హల్చల్ చేస్తున్న ఈ బ్యూటీ సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోందిప్పుడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లికి చిరిగిన చీర కట్టుకొని వెళ్లానని చెబుతుంది..అదేంటీ కోట్లు సంపాదించిన నీకు పట్టు చీరలు, డిజైనింగ్ చీరలు కరువా అన్న ప్రశ్నకు..అబ్బే అదేం లేదు అది మా అమ్మమ్మ చీర నాకు ఎంతో ఇష్టమైన, ఎప్పటికీ గుర్తుండిపోయే చీర అందుకే అది అక్కడక్కడ చిరిగినా నేను నా పెళ్లికి ఆ చీర కట్టుకొని రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పింది.