బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. మొదట ఈ సినిమాకి టైటిల్ గా 'టార్చిలైట్' అనుకున్నారు. కానీ ఇప్పుడు 'శ్రీమతి 21F' అని మార్చారు. ఈ సినిమాలో సదా.. అర్థరాత్రి హైవేలపై విటుల కోసం ఎదురు చూసే క్యారెక్టర్లో కనిపించనుంది. ఓ వేశ్య జీవితానికి సంబంధించిన నిజమైన యదార్థమైన సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా లో అసలు ఆమె వేశ్యగా మరి హైవేలపై వ్యభిచారం చేసే స్థితికి ఎందుకు వచ్చింది అన్న కథాంశం పై ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం.
ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల కావటంతో ట్రైలర్ లో హీరోయిన్ సదా చాలా బోల్డ్ గా కనిపించారు. వేశ్య పాత్రలో సదా షాకింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తన దగ్గరకి వచ్చిన విటుడితో.. ''జాకెట్ విప్పనా..? లేక నువ్వే విప్పుతావా..?'' అని అడుగుతూ బోల్డ్ సీన్స్ లో నటించింది. దీంతో ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.