కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అజిత్. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో అజిత్ కుమార్. అచ్చమైన తెలుగువాడైన అజిత్ హైదరబాద్ లో పుట్టి పెరిగారు. తెలుగు లో 1992లో ‘ ప్రేమపుస్తకం’ పరిచయం అయినప్పటికీ..కోలీవుడ్ లో వరుస విజయాలు అందుకొని అక్కడే సెటిల్ అయ్యాడు. ప్రముఖ నటి షాలినిని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు. అజిత్ కుమార్ చదువుకున్నది పదవ తరగతి వరకు ఐనా బహుభాషాకోవిదుడు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఆంగ్ల భాషలను అనర్గళముగా మాట్లాడగలడు.
గత కొంత కాలంగా అజిత్ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. అజిత్ కుమార్ కి సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వతా శ్రీదేవి కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బోనీకపూర్ అడిగిన వెంటనే అజిత్ ఏ మాత్రం ఆలోచించకుండా బాలీవుడ్ మూవీ 'పింక్' రీమేక్ లో చేశాడు. 'నెర్కొండ పార్వై ' టైటిల్ తో దర్శకుడు వినోద్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. గతంలో శ్రీదేవికి ఇచ్చిన మాట కోసం బోనీ కపూర్ బ్యానర్ లో నెర్కొండ పార్వై సినిమా చేసిన అజిత్ నటించారట. మరోసారి బోనిక్ కపూర్ కోసం మరో సినిమాలో నటిస్తున్నారు అజిత్.
తాజాగా బోనీకపూర్ నిర్మాతగా, వినోద్ దర్శకుడిగా అజిత్ హీరోగా ఈ సినిమా నిన్న పూజ కార్యక్రమాలను జరుపుకుంది. కెరియర్ పరంగా అజిత్ కి ఇది 60వ సినిమా. ఈ సినిమాకి 'వలిమై' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు కాబట్టే కథకి తగ్గట్లు వాలిమై టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఈ వాలిమై సినిమాను 2020 సమ్మర్ కి విడుదల చేసేలా ప్లాన్ చేశారు. త్వరలోనే హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.