వేధింపుల వివాదంలో సినీనటి హేమ !

K Prakesh
సినీనటి హేమకు కూడా వేధింపుల సమస్య తప్పలేదు. సామాన్య స్త్రీలనే కాకుండా సమాజంలో పేరు ప్రఖ్యాతలున్న సెలెబ్రెటీలను కూడా తమ విచిత్రమైన వేధింపులతో కొందరు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ వేధింపుల వల్ల ఆ టార్గెట్ చేసే వ్యక్తులకు ఎటువంటి ప్రయోజనం లేకపోయినా ఒక రాక్షస ఆనందానికి అలవాటు పడిన విష సంస్కృతికి చిహ్నంగా ఇటువంటి సంఘటనలు నిలిచిపోతాయి.  హేమకు అసభ్యకరమైన మేసేజ్ లను పంపిన వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరుస్టు చేసారు అనే వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తి తనకు అసభ్యకర మేసేజ్ పంపుతూ వేధిస్తుండటంతో ఇటీవల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది అని తెలుస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతని పోన్ నెంబర్ ట్రేస్ చేయడం ద్వారా నిందితుడిని పట్టుకున్నారు. అయితే నిందితుడి వివరాలు పోలీసులు ఇప్పుడే బయటకు చెప్పడం లేదు. అతన్ని విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని, విచారణ అణంతరం సైబర్ క్రైం క్రిమినల్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేస్తామని వారు తెలిపారు.  1989లో నటిగా కెరీర్‌ ప్రారంభించిన హేమ వివాహం అనంతరం కూడా సినిమలోలో నటిస్తోంది. ఇటు కామెడీ రోల్స్‌, అటు కేరక్టర్‌ రోల్స్‌ కూడా చేస్తోంది. ఈ వార్త టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది డేగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: