ముద్దుల హీరోతో కన్నుగొట్టే హీరోయిన్.. ఇక రచ్చ మాములుగా ఉండదు..!

shami
రౌడీ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమా మొదలుపెట్టాడు. ఇప్పటికే క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాలో ఏకంగా ఒకరు కాదు ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నాడు ఈ క్రేజీ హీరో.


ఇక ఈ సినిమా తర్వాత డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. బాక్సింగ్ నేపథ్యంతో సాగే ఈ సినిమాకు టైటిల్ గా ఫైటర్ అని పెట్టబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నుగీటి కుర్రాళ్ల హృదయాలను గెలిచిన ప్రియా ప్రకాశ్ నటిస్తుందని తెలుస్తుంది.


అసలే పూరి సినిమా ఆపైన విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోతో ఛాన్స్ ప్రియా ప్రకాశ్ ఎలాంటి ఆఫర్ కోసం అయితే వెయిట్ చేసిందో ఈ సినిమా అదే అంటున్నారు. తప్పకుండా ఈ మూవీ హిట్ అయితే మాత్రం ప్రియా ప్రకాశ్ రేంజ్ మారిపోయే అవకాశం ఉంది. ఒరు ఆధార్ లవ్ సినిమాతో క్రేజ్ అయితే తెచ్చుకుంది కాని ఆ సినిమా పెద్దగా ఆడలేదు.


అందుకే ప్రియా ప్రకాశ్ తెలుగు పరిశ్రమపై దృష్టి పెట్టింది. విజయ్ సినిమాతో పాటుగా నితిన్, చంద్రశేఖర్ యేలేటి మూవీ ఛాన్స్ కూడా అందుకుంది ప్రియా ప్రకాశ్. చూస్తుంటే ప్రియాకు తెలుగు అవకాశాలు బాగానే వస్తున్నట్టు తెలుస్తుంది. కనుసైగతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఒక్క హిట్టు పడితే మాత్రం తన రేంజ్ మారిపోతుందని చెప్పొచ్చు. విజయ్ తో ప్రియా రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అని తెలుగు ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మరి విజయ్, నితిన్ సినిమాల్లో ఆ సూపర్ హిట్ కల నెరవేరుతుందేమో చూడాలి.  




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: