వచ్చే సోమవారం సెలవు ... ఆరెండు సినిమాలకు పండగే
స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన బిగిల్ ను అట్లీ తెరకెక్కించగా విజయ్ కు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. ఇక ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఖైదీ చిత్రానికి సామ్ సీఎస్ నేపథ్య సంగీతం అందించగా డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం పై ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాలో హీరోయిన్ ,సాంగ్స్ లేకపోవడం ప్రత్యేకతలు గా చెప్పవచ్చు. అంతేకాదు ఈసినిమా స్టోరీ కేవలం ఒక్క రాత్రి లోనే జరుగుతుంది. మరి ప్రయోగాత్మక సినిమా గా రానున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి. ఈరెండు సినిమాలు కూడా తమిళం తోపాటు తెలుగులో ఒకేసారి విడుదలకానున్నాయి. కార్తికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండడం తో తెలుగులోఈ చిత్రం భారీస్థాయిలో విడుదలవుతుండగా విజయ్ బిగిల్ కూడా విజిల్ టైటిల్ తో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక స్క్రీన్ లలో విడుదలవుతుంది. దాంతో విజయ్ కి ఈ చిత్రం తెలుగులో సాలిడ్ మార్కెట్ ను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.