ఆర్టీసీ క్రాస్ రోడ్ లో తమిళ స్టార్ హీరో విజయ్ కి 50ఫీట్ల కటౌట్
ఇదిలా ఉంటే విజిల్ పై తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి అంచనాలు వున్నాయి. దాంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 700స్క్రీన్ లలో విడుదలచేస్తున్నారు. యంగ్ ప్రొడ్యూసర్ మహేష్ ఎస్ కోనేరు ఈసినిమా థియేట్రికల్ హక్కులు దక్కించుకోగా ఏపీ &తెలంగాణ లో కలిపి ఈ చిత్రం 10కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా కు కనుక హిట్ టాక్ వస్తే రజినీ , సూర్య తరహాలో తెలుగులో విజయ్ కి కూడా మంచి మార్కెట్ ను ఏర్పడనుంది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 4000 పై చిలుకు స్క్రీన్ లలో విడుదలవుతుంది. విజయ్ కెరీర్ లోనే ఇదే అతి పెద్ద రిలీజ్. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యం లో అట్లీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. సుమారు 180కోట్ల బడ్జెట్ తో ఎజిఎస్ ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. తమిళనాడు లో విజయ్ కి వున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఈ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.