దీపావళికి రాములమ్మ గిఫ్ట్...!!

Satya
దీపావళి అంటేనే బాంబుల మోత. అలా ఇలా సందడి ఉండదు. హోరెత్తిపోతుంది. కళ్ళకు, చెవులకు ఒకటే  పని చెబుతుంది ఈ పండుగ. మరి ఇదివరకు అయితే దీపావళి రోజున కొత్త సినిమాలు కూడా విడుదల అయ్యేవి. కానీ ఇపుడు టాలీవుడ్ ట్రెండ్ మార్చింది. పూర్తిగా సెంటిమెంట్ ను నమ్ముకుని ఒకటి రెండు సీజన్ల మీదనే పడిపోతోంది. దాంతో దీపావళి వెలుగులు తెలుగు సినిమాకు లేకుండా పోతున్నాయి.


అయితే సెట్స్ మీద ఉన్న సినిమాలు, రిలీజ్ చేయాలనుకుంటున్న సినిమాలకు సంబంధించి పోస్టర్లు, టీజర్లు రిలీజ్ చేయడం మాత్రం జరుగుతోంది. ఈ దీపావళికి వెరీ వెరీ స్పెషల్ గా డిజైన్ చేయాలని సరిలేరు నీకవ్వరు ఫిల్మ్ యూనిట్ చూస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాలో పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్న విజయశాంతి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారని అంటున్నారు.


విజయశాంతి విషయానికి వస్తే ఆమె 2006 లో చివరిసారిగా నాయుడమ్మ మూవీ నటించారు. అప్పటి నుంచి ముఖానికి మేకప్ వేసుకోలేదు. అయితే విజయశాంతి తరువాత టీయారెస్ ఎంపీగా నెగ్గి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇపుడు మళ్ళీ విజయశాంతి వెండితెరను పలకరిస్తున్నారు. రాయలసీమకు చెందిన బలమైన నాయకురాలి పాత్రలో ఈ మూవీలో విజయశాంతి కనిపిస్తారట.


దాంతో విజయశాంతి ఫస్ట్ లుక్ మీద ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోతోంది. ఈ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ అంటే విజయశాంతి అని వేరే చెప్పక్కర్లేదు అందుకే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫస్ట్ లుక్ పేరిట మెస్మరైజ్ చేయాలనుకుంటున్నారు.  ఓ సూపర్ హీరో ఈ మూవీలో ఉండగా అయన్ని పక్కన పెట్టి మరీ విజయశాంతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారంటే రాములమ్మ ఇంపార్టెన్స్ ఏంటో అర్ధమైపోతోందిగా. మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కి దీపావళి పండుగే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: