డిసెంబర్ లో రెడీ అవుతున్న రవితేజ..?
రవితేజ సరసన పాయల్ రాజ్పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తుండగా… సునీల్, రామ్కీ, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా ఐస్లాండ్ దేశంలో జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇటీవల బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో పోరాటాల సన్నివేశాల కోసం రవితేజ ఐస్ ల్యాండ్ లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో అదిరిపోయే యాక్షన్ సీన్స్ చేశాడని ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఐస్ ల్యాండ్ షెడ్యూల్లో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్టు సమాచారం.
ప్రస్తుతం… హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో చిత్రానికి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుందని వినికిడి. యువ సంగీత సంచలనం ఎస్.ఎస్.థమన్ బాణీలు అందిస్తున్న ‘డిస్కో రాజా’… క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సినిమా యూనిట్ ట్రై చేస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని రవితేజ అభిమానులు కోరుకుంటున్నారు.