డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సల్మాన్ ఖాన్ సినిమా?
ఇదే తరుణంలో షాహిద్ కపూర్ కూడా ఇటువంటి సిచువేషన్ లోనే ఉన్న సందర్భంలో తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ‘అర్జున్ రె’డ్డి సినిమా’ కబీర్ సింగ్’ గా రీమేక్ చేసి మంచి హిట్ అందుకని ఇప్పుడు నాని నటించిన 'జెర్సీ' సినిమా రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్ 3' ప్రభుదేవా డైరెక్షన్ లో తెరకెక్కింది.
ఈ క్రమంలో ఈ సినిమా త్వరలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఇటీవల విడుదల చేశారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడం భాషలలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 20వ తారీఖున విడుదల కావడానికి సిద్ధంగా. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... దబాంగ్ 3 సినిమా గురించి అనేక విషయాలు చెబుతూ ఉన్న తరుణంలో మీడియా విలేఖరి పూరి జగన్నాధ్ తో సినిమా ఎప్పుడు అని ప్రశ్నించగా...సల్మాన్ ఖాన్ బదులిస్తూ .. నవంబర్ ఫస్ట్ వీక్లో హైదరాబాద్ వస్తాను అప్పుడు ప్రభుదేవా, నేను కలిసి పూరి జగన్నాద్ ని కలుస్తాం.. తప్పకుండా పూరితో సినిమా చెయ్యాలని నాకు ఉంది అన్నారు. మరి పూరి జగన్నాథ్ తో సల్మాన్ సినిమా ఉంటుందో లేదో చూడాలి.