ఎట్టకేలకు రొమాన్స్ కు సిద్దమైన సాయి పల్లవి....!!

Mari Sithara
టాలీవుడ్ సినిమా పరిశ్రమకు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ సాయి పల్లవి. స్వతహాగా మంచి డాన్సర్ గా పేరున్న సాయి పల్లవి, శేఖర్ కమ్ములతో చేసిన తొలిసినిమా తోనే సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో పాటు, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తన ఆకట్టుకునే అందం మరియు అద్భుతమైన నటనతో మంచి పేరు దక్కించుకుంది. ఇకపోతే, ఇటీవల తమిళ నాట ఎన్జీకే, మారి2 సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి పేరు సంపాదించిన సాయి పల్లవి, 

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఇక దానితో పాటు రానా హీరోగా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న విరాట పర్వం 1992 షూటింగ్ లో కూడ ఆమె త్వరలో జాయిన్ కాబోతోంది. తొలుత రానాతో కలిసి కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో సాయి పల్లవి నటించబోతోందని అంటున్నారు. వేణు అడుగుల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి ఒక ఫోక్ డాన్సర్ గా నటిస్తోందని అంటున్నారు. 

అలానే రానా ఒక నక్సలైట్ గా నటిస్తున్న ఈ సినిమా కథ, కొన్నేళ్ల క్రితం నక్సలైట్ గ్రూపులకు మరియు ప్రభుత్వానికి మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోందట. సినిమా ఆద్యంతం అలరించే సన్నివేశాలతో తెరకెక్కుతోందని, తప్పకుండా రేపు రిలీజ్ తరువాత మంచి సక్సెస్ సాధిస్తుందని సినిమా యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు రానా కూడా హాతి మేరె సాతి సినిమాలో నటిస్తూ, త్వరలో గుణశేఖర్ తెరకెక్కించనున్న హిరణ్యకశ్యప కోసం సిద్ధం అవుతున్నారు. మరి తొలిసారి రానా మరియు సాయి పల్లవిల కాంబినేషన్లో రాబోతున్న విరాట పర్వం సినిమా, ఎంతమేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: