వెంకీమామ చిత్రం నుండి అప్డేట్ అదిరింది

Pranateja Sriram
వెంకటేష్ , నాగ చైతన్య హీరోలుగా పాయల్ రాజ్ పుత్ , రాశి ఖన్నా లు హీరోయిన్లు గా తెరకెక్కుతున్న చిత్రం వెంకీమామ. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్- నాగచైతన్య.. మామ అల్లుళ్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రీల్ లైఫ్ మామ అల్లుళ్ళైన వెంకటేష్ నాగ చైతన్యలని ఒకే ఫ్రేమ్ లో విజువల్ ట్రీట్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రం తాలూకా దీపావళి గిఫ్ట్ వచ్చి అభిమానులను ఆకట్టుకుంది.


ఇప్పటికే వెంకీ మామ నుంచి రకరకాల స్టిల్స్ రిలీజై ఆకట్టుకున్నాయి.  వినాయక చవితి- దసరా పోస్టర్లు అభిమానుల్ని మైమరిపించాయి. దీపావళి కానుకగా చిత్ర సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో చైతు ఆర్మీ డ్రెస్ లో కనిపించగా..వెంకీ మాములుగా కనిపించాడు. ఈ చిత్రం లో చైతు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనుండగా, వెంకటేష్ పల్లెటూరు వ్యవసాయ దారుడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.


అయితే ఈ పోస్టర్ చూస్తుంటే ఏదో సీరియస్ గా ఉన్నట్టే అర్థం అవుతుంది. ఈ పోస్టర్ లో పరిశీలనగా చూస్తే దూరంగా మంచు కొండలు లాంటి ప్రదేశాలు హెలికాప్టర్ కనిపించడంతో బార్డర్ లో ప్రత్యేక సన్నివేశాలు ఉండేలాగా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ కి, నాగచైతన్య ల మధ్య వచ్చే సీన్లు ఆసాంతం అలరిస్తాయట. మరి ఈ మామ ఆల్లుళ్ళు ఎలాంటి సందడి చేస్తారేమో చూడాలి. అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంతవరకు తెలియట్లేదు. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రం పోటీలో నిలబడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.  
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: