‘రంగస్థలం’ మూవీ విడుదలై దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తరువాత ఆ మూవీ దర్శకుడు ఏకంగా ఏడాదిన్నర ఖాళీగా ఉండటం ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎప్పుడు జరగలేదు. అయితే సుకుమార్ అలాంటి గ్యాప్ ను నవ్వుతు ఎలాంటి అసహనాన్ని బయటపడ నివ్వకుండా చాల తెలివిగా మేనేజ్ చేసాడు.
సూపర్ స్టార్ మహేష్ కోసం ఏడాది వేచి చూసి ఆ నిరీక్షణతో విసిగిపోయి తెలివిగా బన్నీ వైపు యూటర్న్ తీసుకుని కష్టపడి బన్నీతో సినిమాను చేయడానికి రంగం సిద్ధం చేసుకుని మహేష్ పై స్వీట్ రెవింజ్ తీర్చుకున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ మాఫియా చుట్టూ అల్లబడ్డ ఈ కథను శేషాచలం అటవీ ప్రాంతంలో చాల సహజంగా తీయడానికి సుకుమార్ స్క్రిప్ట్ తో సహా అన్ని పనులు పూర్తి చేసాడు.
ఈ మూవీ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కాబోతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు లీక్ అయింది. అల్లు అర్జున్ ఈ మూవీలో చాల ఎక్కువ భాగం లుంగీ బనీను వేసుకుని చాల రఫ్ లుక్ లో కనిపించే విధంగా సుకుమార్ బన్నీ లుక్ ను డిజైన్ చేసినట్లు టాక్. త్రివిక్రమ్ మూవీ షూటింగ్ పూర్తి అయిన వెంటనే బన్నీ తన రఫ్ లుక్ కోసం తన శరీర ఆకృతిలో కూడ చాల మార్పులు చేసుకోబోతున్నట్లు టాక్.
‘రంగస్థలం’ మూవీలో రామ్ చరణ్ రఫ్ లుక్ ఎలా ఆ మూవీకి కీలకంగా మారిందో ఇప్పుడు సుకుమార్ లేటెస్ట్ మూవీకి కూడ బన్నీ రఫ్ లుక్ కీలకం కాబోతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ‘రంగస్థలం’ మూవీలో చరణ్ నటనకు కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో నేషనల్ అవార్డ్ మిస్ అయింది. అయితే చరణ్ కెరియర్ లో ‘రంగస్థలం’ కలక్షన్స్ రికార్డ్ లు ఒకట్రెండింగ్ గా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో చరణ్ సాధింపలేకపోయిన నేషనల్ అవార్డును అందుకోవడానికి రామ్ చరణ్ సుకుమార్ సహకారంతో బాగా కష్టపడి విజయంతో పాటు అవార్డులను కూడ అందుకోవడానికి మానసికంగా సిద్ధపడుతు ఈ రఫ్ లుక్ ను ఎంచుకున్నాడు అనుకోవాలి..