బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేసులో ఆ ఇద్దరి మధ్య టాఫ్ ఫైట్!
చాలామంది సెలబ్రిటీలు శ్రీముఖి గెలవాలని వీడియోలు షేర్ చేస్తూ శ్రీముఖి కి మద్దతిస్తూ క్యాంపెయిన్ చేస్తుంటే...మరోపక్క రాహుల్ కి సామాన్య ప్రజలు ఫుల్ సపోర్ట్ చేస్తూ..రాహుల్ చాలా జెన్యూన్ పర్సన్ అంటూ ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద మాట్లాడటం ఎటువంటి మార్పు లేకుండా ఈ సీజన్లో ఆడింది రాహుల్ అని కామన్ పీపుల్ మాట్లాడుతూ వీడియోలు షేర్ చేస్తూ రాహుల్ ని గెలిపించాలని కోరుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న ట్రెండ్ ప్రకారం అలాగే చాలామంది అంచనాల ప్రకారం శ్రీముఖి-రాహుల్ ల్లోనే ఒకరికి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అందుకే వీరి ఫ్యాన్స్ మధ్య తీవ్ర ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. బిగ్బాస్ ఫినాలేలో శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్, వరుణ్, అలీ పోటీ పడుతున్నారు. ఈ ఐదుగురులో వరుణ్, అలీలకు విన్నర్ అయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవని తెలుస్తోంది. ఇక బాబా భాస్కర్ కు కొంతవరకు అవకాశాలు ఉన్నాయి గానీ..అది పూర్తి స్థాయిలో కాదని అంటున్నారు. ఇప్పటిదాకా జరిగిన ఓటింగ్ ప్రకారం చూస్తే శ్రీముఖి-రాహుల్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే వీరిద్దరిలో ఎవరు విన్ అవుతారు అన్న ఉత్కంఠత ప్రతి ఒక్కరిలో నెలకొంది.