సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన అద్బుతమమైన దర్శకత్వ ప్రతిభతో టాలీవుడ్ హేరోలతో పాటు బాలీవుడ్ బడా హీరోలను సైతం దర్శకత్వం వహించి, దేశవ్యాప్తంగా దర్శకుడిగా మంచి పేరు సంపాదించారు. అయితే ఆయన వ్యక్తిగత ప్రవర్తన మరియు వ్యవహార శైలి మాత్రం ఎంతో చిత్రంగా ఉంటుందనేది మాత్రం ఒప్పుకోక తప్పదు. తనకు నచ్చిన, లేదా నచ్చని సినిమాలు కానీ, రాజకీయాలు కానీ, లేదా మరేదైనా ఇతర విషయమై కానీ, ఏ మాత్రం ఆలోచించకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం, ఒకవేళ అది తనకు అది మరింతగా నచ్చితే, దానిని సినిమా రూపంలో తీయడం వర్మకు అలవాటు. గతంలో రక్త చరిత్ర, వంగవీటి వంటి కొన్ని వివాదాస్పద సినిమాలు తీసిన వర్మ,
ఇటీవల లక్ష్మీస్ ఎన్టీర్ పేరుతో తెరకెక్కించిన సినిమాను రిలీజ్ చేసే సమయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు టిడిపి నాయకులు దాని విడుదలను అడ్డుకోవడంతో, కొద్దిరోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో టిడిపి ఓడిపోయి వైసిపి విజయం సాధించడంతో, సీఎం జగన్ గారి ఆదేశాలతో చివరికి లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ చేసారు. ఇక అప్పటినుండి టీడీపీని మరియు చంద్రబాబు గారిని ఒకింత పరోక్షంగా తన ట్విట్టర్ ద్వారా సెటైర్లతో టార్గెట్ చేస్తూ వచ్చిన వర్మ, ఇటీవల మరింతగా ఒకడుగు ముందుకు వేసి కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే పేరుతో సినిమా తీశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇకపోతే ఆ సినిమా విషయమై నిన్న ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లైవ్ లో మాట్లాడిన వర్మ,
ఆ ఛానల్ ప్రతినిధి, ట్రైలర్ లో చంద్రబాబు పాత్రధారి తన కుమారుడికి పప్పు వడ్డించే సీన్ మీరు కావాలనే ట్రైలర్ లో పెట్టారా అని ప్రశ్నించగా, తనకు తెలిసినంతవరకు పప్పు అనేది మన సౌత్ ప్రజలు తినే ఒక కమ్మని వంటకం మాత్రమే అని, ఆ వంటకాన్ని గుర్తు చేస్తూనే ఒక తండ్రి తన కొడుక్కి పప్పు వడ్డించే సీన్ పెట్టానని, అంతే తప్ప ఏ వ్యక్తిని ఉద్దేశించి పెట్టలేదని, అంతకు మించి తనకు ఏమి తెలియదని అన్నారు. అయితే ఈ విషయమై ఇప్పటికే పలు సోషల్ మీడియాలో లోకేష్ ని పప్పు అని గుర్తు చేస్తూ ఆ ట్రైలర్ లో పప్పు వడ్డించే సీన్ ని వర్మ ట్రైలర్ లో పెట్టారనే చర్చ విపరీతంగా జరుగుతోంది. ఈ విషయమై వర్మ తనకు ఏమి తెలియదు అంటూ తెలివిగా మాట్లాడడం నిజంగా విడ్డూరం అంటూ కొందరు టిడిపి ఫ్యాన్స్, వర్మపై మండిపడుతున్నారు.....!!