అల్లు అర్జున్ సుకుమార్ మూవీలో బన్నీ మేనమామ ట్విస్ట్ !

Seetha Sailaja
ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నటులు నిత్మాతల సంఖ్య ఒక క్రికెట్ టీమ్ సంఖ్యను దాటి పోతోంది. ఇలాంటి పరిస్థితులలో అల్లు ఫ్యామిలీ నటులు నిర్మాతలు సంఖ్యను కూడ మెగా ఫ్యామిలీతో సమానంగా చేయడానికి బన్నీ ప్రయత్నిస్తున్నాడా అన్న సందేహాలు నటుల సంఖ్యతో సమానం చేయడానికి బన్నీ ప్రయత్నిస్తున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

ఇప్పటికే అల్లు అర్జున్ తో పాటు శిరీష్ హీరోలుగా కొనసాగుతూ ఉంటే వీరి అన్న అల్లు బాబి నిర్మాతగా మారి వరసపెట్టి సినిమాలు తీస్తూ విలన్ గా ఎంటర్ అవ్వడానికి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఎవరు ఊహించని విధంగా నిన్న ప్రారంభం అయిన అల్లు అర్జున్ సుకుమార్ ల మూవీ ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ మేనమామ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

బన్నీ తల్లి నిర్మల సోదరుడు ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. వాస్తవానికి ఈ మూవీని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. అయితే మైత్రీ మూవీస్ నిర్మాతలకు జోడీగా ఇప్పుడు బన్నీ మేనమామ వచ్చి చేరడం వెనుక బన్నీ పరోక్ష హస్తం ఉంది అని అంటున్నారు. 

అల్లు అర్జున్ కొన్ని చిన్న సినిమాలు తీయడానికి A.A. ఆర్ట్స్ అన్న నిర్మాణ సంస్థను ఇప్పటికే ప్రారంభించాడు. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ వ్యవహారాలను బన్నీ మేనమామ చూసుకుంటాడ అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికితోడు మైత్రీ మూవీస్ సంస్థ నుండి ఒక కీలక భాగస్వామి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో మైత్రీ మూవీస్ కు ఆర్ధిక బలం చేకూర్చడానికి బన్నీ ఈ వ్యూహం అనుసరించాడు అని అంటున్నారు. అల్లు అర్జున్ తో చాల సన్నిహితంగా ఉండే ఈయన భవిష్యత్ లో ఫిలిం మేకింగ్ లో చాల యాక్టివ్ గా మారే ఆస్కారం ఉందిఅన్న మాటలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: