బిగ్ బాస్ బాస్ లో బాబా భాస్కర్ ప్రయాణం గురించి ఏవీ కట్ చేశారు. అంతకుముందు రాహుల్, వరుణ్ ల కి కూడా వారి ఏవీ ని చూపించారు. అయితే వారిద్దరి కంటే బాబా భాస్కర్ ఏవీ అందరి దృష్టిని ఆకర్షించింది. దానికి కారణం వాళ్ళు ఏవీ కట్ చేసిన విధానమే. రాహుల్, వరుణ్ లని సింపుల్ గా చూపించిన బిగ్ బాస్ బాబా కి ఇంత హైప్ ఎందుకిచ్చాడనే ప్రశ్న మొదలైంది.
బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు బాబా భాస్కర్ ని ఒక రెండు వారాలు మాత్రమే ఉంటాడని అందరూ అనుకున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఆ విధంగానే ఆలోచించారు. బాబా ని ఒక రెండు వారాల వరకే పరిమితం చేసి ఆ తర్వాత ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన మీద నెగెటివ్ గా అర్థం వచ్చేలా ప్రసారం చేశారు. అయితే అవేమీ బాబా భాస్కర్ ని ఎలిమినేట్ చేయలేకపోయాయి.
దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు మళ్ళీ రంగంలోకి దిగి బాబాని మాస్కర్ అంటూ ట్యాగ్ ఇచ్చారు. చాలా రోజులు నాగార్జున చేతనే బాబా మాస్కర్ అంటూ చెప్పించారు. అయితే వీటన్నింటినీ తట్టుకుని బాబా చివరి వరకు వచ్చేశాడు. బాబాని టాప్ ఫైవ్ లో ఉండకూడదని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ప్రేక్షకులు అతన్ని సేవ్ చేశారు. అయితే చివరికొచ్చేసరికి బాబాని ఎలివేట్ చేయడం మొదలు పెట్టారు.
సూపర్‌స్టార్ ఆఫ్ ది సీజన్' అంటూ అతడి జర్నీకి కట్ చేసిన వీడియో బుధవారం ఎపిసోడ్లో హైలైట్ అయింది. దీంతో ఒక్కసారిగా బాబా భాస్కర్ ట్రెండింగ్‌లోకి వచ్చేసాడు. ఇంకా మూడు రోజుల ఓటింగ్ మిగిలి వుండగా, బాబాకి వచ్చిన ఈ ఎలివేషన్ ఓటింగ్స్ని, రిజల్ట్స్‌ని తీవ్రంగా ప్రభావితం చేయగలదు. ఇలా చేయడం ద్వారా ఎవరికి బాబా భాస్కర్ కి లాభించే విషయమే. అది ఇలా చేయడం ఎంతవరకు కరెక్టో బిగ్ బాస్ కే తెలియాలి.