మెగా కోడలు పీఎంపై చేసిన కామెంట్స్ కు మెగాస్టార్ కాకాపట్టే ప్రయత్నం చేయబోతున్నాడా? లేకపోతే చిరంజీవి మైండ్ గేమ్ ఏదైనా ప్లే చేయబోతున్నాడా? రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ప్రదాని నరేంద్రమోడీపై హాట్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడు మెగా బాస్ ప్రధానిని కూల్ చేయబోతున్నట్టు సమాచారం.
ప్రెస్టిజియస్ మూవీ సైరా డబ్బులు ఎన్నో తెచ్చిపెట్టిందనే కంటే చిరంజీవికి మాత్రం మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతోంది. తెలుగులో మంచి కలెక్షన్లు నమోదు చేస్తున్న ఈ చిత్రం బయట మాత్రం అనుకున్న స్థాయిలో రాబట్టలేకపోయింది. అయితే నటుడిగా మాత్రం చిరంజీవి కెరీర్ లో సైరా చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచిపోయింది. ఇప్పటికే సినిమాపై క్రిటిక్స్ సహా సినీ.. రాజకీయ రంగ ప్రముఖుల ప్రశంసలు కురిపించారు. చిరంజీవి సైతం ఈ సినిమాను సినీ రాజకీయ ప్రముఖులకు చూపించి సంబరపడుతున్నాడు.
ఇప్పటికే వెంకయ్యనాయుడు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం సైరా సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పుడు మెగా టీం సైరా సినిమాను ఏకంగా ప్రధానమంత్రికి చూపించేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. అందుకు పీఎంవోలో ఏకంగా ప్రధానమంత్రికి చూపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అందుకు పీఎంవోలో అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారట. నిజానికి ఇంతకు ముందే మోడీకి చూపించాలని ప్లాన్ చేశారు. కానీ ప్రధాని ఎన్నికల హడావిడిలో ఉండటంతో కుదరలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ హడావిడిగా ముగియడంతో పీఎంవో నుంచి చిరు, చరణ్ కు ఆహ్వానం అందిందని తెలుస్తోంది.
ఇటీవలే మహాత్మాగాంధీ జయంతి సందర్బంగా స్వచ్ఛభారత్ కు తెలుగు స్టార్లను మోడీ ఆహ్వానించకపోవడంపై మెగా కోడలు ఉపాసన గుర్రుమన్న సంగతి తెలిసిందే. నేరుగా ప్రధాని మోడీనే నిలదీస్తూ ఓ లేఖను రాసింది. ఇప్పుడు మామ చిరంజీవి, భర్త రామ్ చరణ్ మాత్రం పీఎంకు సైరా సినిమా చూపించబోతున్నారు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మైండ్ లో ఏదైనా కొత్త గేమ్ ప్లాన్ చేస్తున్నాడా అనే టాక్ కూడా నడుస్తోంది. మరి మెగా కోడలు కామెంట్స్ కు మోడీ, సౌత్ స్టార్స్ ని తీసుకోకపోవడంపై రిప్లై ఇస్తాడో లేదో చూడాలి.