సుకుమార్ ఫాలోయింగ్ కు షాక్ లో రాజమౌళి కొరటాల !

Seetha Sailaja
ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోలతో పాటు టాప్ దర్శకులు కూడ మారిపోతున్నారు. టాప్ హీరోలు లాగే తమకు పారితోషికాలు వద్దనీ మూవీ బిజినెస్ లో తమకు షేర్ ఇమ్మని డిమాండ్స్ పెడుతున్నారు. ఇలాంటి డిమాండ్స్ పెట్టే విషయంలో రాజమౌళి కొరటాల శివలు చాల ముందు వరుసలో ఉంటారు.

అయితే సౌమ్యుడుగా పేరున్న సుకుమార్ కూడ మైత్రీ మూవీస్ సంస్థకు ఈ డిమాండ్స్ ను అల్లు అర్జున్ సినిమా విషయంలో పెట్టి పట్టుపట్టి తన పంతం నెగ్గించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు నిన్న ప్రారంభం అయిన అల్లు అర్జున్ సుకుమార్ ల మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి సుకుమార్ ఈ మూవీ బిజినెస్ లో షేర్ తీసుకోవడమే కాకుండా ఈ మూవీ నిర్మాణ సమయంలో నెలకు 10 లక్షలు ఖర్చులు నిమిత్తం తీసుకుంటున్నట్లు టాక్. 

వాస్తవామోలో ఈ డిమాండ్ ను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాతలు అంగీకరించపోయినా సుకుమార్ చాల తెలివిగా ఈ మూవీ నిర్మాతలను బుట్టలో పెట్టాడాని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా నిన్న ప్రారంభం అయిన ఈమూవీ నిర్మాణాన్ని సుకుమార్ చాల వేగంగా పూర్తి చేయాలి అన్న కండిషన్ తో బన్నీ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీని సమ్మర్ రేసుకు విడుదల చేసేలా బన్నీ సుకుమార్ చేత పరుగులు తీయిస్తాడు అని టాక్. వచ్చే ఏడాది సమ్మర్ కు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదల విషయంలో డౌట్స్ ఉన్న నేపధ్యంతో పాటు మహేష్ మూవీ కూడ ఏదీ పోటీగా లేని పరిస్థితులలో వచ్చే ఏడాది రాబోతున్న సమ్మర్ ను వదులుకోకుండా బన్నీ ఈ వ్యూహాలు అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతున్నట్లు సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: