సుధీర్- రష్మీ లా పెళ్లి అంటూ సరికొత్త న్యూస్..?
ముఖ్యంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కచ్చితంగా నిజజీవితంలో పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో అనేక వార్తలు రావడమే కాకుండా మీడియా మాధ్యమాల్లో కూడా ప్రచారం జరిగింది. దీంతో తమపై వస్తున్న పెళ్లి వార్తలు ఇద్దరూ ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా ఇవి మాత్రం ఆగడం లేదు. వీరి పెళ్లి గురించి వీరికే కాదు జబర్దస్త్ నటులు ఎక్కడికి వెళ్లినా వాళ్లకు కూడా ప్రశ్నలు తప్పవు.
ఇక జబర్దస్త్‌కు వచ్చిన ప్రేక్షకులు కూడా కొందరు జబర్దస్త్ యాక్టర్స్‌కు ఇదే ప్రశ్న వేయగా వారు ప్రశ్న వేసిన వాళ్లకు షాక్ అయ్యేలా ఆన్సర్ ఇచ్చారు. వారిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు బయట వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే అయితే వాళ్ళిద్దరూ పెళ్లి గురించి వస్తున్న ఇటీవల వార్త నిజమే కానీ...అది రియల్ కాదు షోలో భాగమేనని ఇటీవల సదరు షో కి సంబంధించిన యాక్టర్స్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో సుధీర్ — రేష్మి ల పెళ్లి గురించి వస్తున్న వార్తలు అవాస్తవమని తేలిపోయింది.