అందుకే రాహుల్ ఫైనల్ కి వెళ్ళాడు అంటున్న రాహుల్ తల్లి..!
ఇక హీరో వరుణ్ సందేశ్ టైటిల్ కలవడానికి అన్ని విధాల అర్హత ఉందని ఇంటి నుండి ఎలిమినేట్ అయిన వరుణ్ సందేశ్ భార్య వితిక ప్రచారం చేస్తోంది. మిగిలిన కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉండగా రాహుల్ సిప్లిగంజ్ తల్లి ఏ ఎమోషనల్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాహుల్ బిగ్ బాస్ హౌస్ లో ఇంత దూరం వచ్చాడంటే అందుకు కారణం అతడి నిజాయతీ, ముక్కు సూటితనం అని చెప్పింది.
ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రాహుల్ కు ఓట్ చేసి అతడిని గెలిపించండి అని ఆమె ప్రేక్షకులని కోరింది. ఇదే క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజల్లో రాహుల్ గెలవాలని ఎటువంటి కన్నింగ్ గేమ్ ఆడకుండా ముక్కుసూటిగా మాస్కులు లేకుండా ఇంటిలో రాణించింది కేవలం రాహుల్ మాత్రమే అంటూ రాహుల్ టైటిల్ గెలవటానికి అన్ని విధాల అర్హతలు ఉన్నాయని...రాహుల్ ని గెలిపించాలని కామన్ పీపుల్ కోరుతున్నారు. మరి టైటిల్ ఎవరు గెలుస్తారో చూడాలి.