మీకు మాత్రమే చెప్తా.. షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువ.. సినిమాకు తక్కువ.. ?

shami
స్టార్ సినిమాలకు బడ్జెట్ కోట్లకు దాటి వెళ్తుంటే చిన్న సినిమాలకు మాత్రం లిమిటెడ్ బడ్జెట్ తో సినిమాలు పూర్తి అవుతున్నాయి. అయితే బడ్జెట్ ఎంతైనా కాని కంటెంట్ ఉన్న సినిమాలకే ఆడియెన్స్ ఓటు ఉంటుందని చెప్పొచ్చు. కంటెంట్ లేని సినిమాలు కోట్లు ఖర్చు పెట్టినా వేస్ట్ అన్నట్టే. అందుకే ఈమధ్య స్టార్స్ కూడా సినిమా కథ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు.


అయితే స్టార్స్ చేయలేని కొన్ని కథలు.. సినిమాలు మీడియం బడ్జెట్ హీరోలు చేస్తారు. వీటిలో కొత్త కంటెంట్ అది కొత్త వాళ్లతో అయినా వెళ్తుందని భావిస్తే మాత్రం అంతా ఫ్రెష్ టాలెంట్ తో తీసే అవకాశం కూడా ఉంటుంది. లేటెస్ట్ గా అలాంటి ఓ క్రేజీ కంటెంట్ తో వచ్చిన సినిమానే మీకు మాత్రమే చెప్తా. పొరపాటున మనకు సంబందించిన ఓ సీక్రెట్ వీడియో సోషల్ మార్కెట్ లోకి వెళ్తే మన పరిస్థితి ఏంటన్నది ఈ సినిమా కాన్సెప్ట్.


కథ చాలా సింపుల్ గా నీట్ గా రాసుకున్న డైరక్టర్ షమ్మీర్ సుల్తాను కొంతవరకు బాగానే నడిపించాడని చెప్పొచ్చు. సినిమా మొత్తం తరుణ్ భాస్కర్, అభినవ్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. మీకు మాత్రమే చెప్తా శుక్రవారం రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా అంతా బాగుంది కాని ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వచ్చేసరికి తేడా కొట్టేసింది. నిర్మాతగా విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ విషయంలో కేర్ తీసుకోలేదని తెలుస్తుంది.


సినిమా చూసిన కొందరు షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువ సినిమాకు తక్కువ అన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ విజయ్ పట్టించుకోడు అన్నది అందరికి తెలిసిందే. నిర్మాణ విలువలు ఎలా ఉన్నా తరుణ్ భాస్కర్ టైమింగ్ కు సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఎలాగోలా విజయ్ తన మొదటి సినిమాతో హిట్ కొట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: