ఈసారి జరగబోతున్న సంక్రాంతి రేస్ బన్నీ మహేష్ ల వార్ గా మారింది అన్న విషయాన్ని పక్కకు పెడితే ఈ రేస్ ఇప్పుడు దిల్ రాజ్ కు చుక్కలు చూపెడుతోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి దిల్ రాజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటే ‘అల వైకుంఠపురములో’ మూవీ నైజాం రైట్స్ ను దిల్ రాజ్ అత్యంత భారీ మొత్తానికి కొనుక్కోవడంతో దిల్ రాజ్ కు ఈ రెండు సినిమాల విజయం చాల అవసరం.
ఈ సంవత్సరం దిల్ రాజ్ కు మిశ్రమ ఫలితాలు వచ్చినా ఆ విషయాలను పట్టించుకోకుండా మరింత రెట్టించిన ఉత్సాహంతో దిల్ రాజ్ పరుగులు తీస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీలు ఒకేరోజు విడుదల కావడం దిల్ రాజ్ కు ఏమాత్రం ఇష్టం లేదని టాక్.
ఇలా ఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలైతే ఈ మూవీల ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో భారీ కొత్త పడి నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా ఇలా తాను రెండు విధాల నష్టపోతాను అన్న ఫీలింగ్ దిల్ రాజ్ కు ఏర్పడినట్లు సమాచారం. దీనితో ఈమధ్య దిల్ రాజ్ మహేష్ ను కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని రెండు రోజులు ముందుగా జనవరి 10న విడుదల చేయడానికి సహకరించమని లేకుంటే తాను ఈ మూవీ ప్రాజెక్ట్ నుండి సహా నిర్మాతగా తప్పుకుంటాను అంటూ సున్నితంగా హెచ్చరించినట్లు గాసిప్పులు వస్తున్నాయి.
దీనితో ఎలర్ట్ అయిన మహేష్ ప్రస్తుతం కేరళలో జరగబోతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాత అన్ని విషయాలు కూల్ గా మాట్లాడుకుందామని మహేష్ తన సహజ సిద్ధమైన చిరు నవ్వుతో దిల్ రాజ్ ను కూల్ చేసి పంపినట్లు టాక్. వాస్తవానికి ఈ సంక్రాంతి రేస్ లో ముందుకు జరగాలి అని మహేష్ కు కూడ అనిపిస్తున్నా ఈ ప్రతిపాదన బన్నీ నుండి వస్తే బాగుంటుంది అన్న ఆలోచనలలో మహేష్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..