యువరత్న నందమూరి బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సింహ, లెజెండ్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్లు ఈ కాంబినేషన్ లోనే వచ్చాయి. అందుకే ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న బాలయ్య ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే బోయపాటి సినిమాతో జాయిన్ కానున్నాడు.
బోయపాటితో బాలయ్య చేసిన రెండు సినిమాల్లో బాలయ్య ఇద్దరు భామలతో రొమాన్స్ చేస్తాడు. సింహాలో నయనతార - స్నేహా ఉల్లాల్.. లెజెండ్ లో రాధికా ఆప్టే - సోనాల్ చౌహాన్ మధ్య బాలయ్య ముద్దుల ప్రియుడుగా నటించారు. అదే సెంటిమెంట్ ను జై సింహాలోనూ రిపీట్ చేశాడు. నయనతార - నటాషా దోషి.. అలాగే హరిప్రియలతో రొమాన్స్ చేశాడు. తాజాగా బోయపాటి మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నాడని సమాచారం.
ఈ క్రమంలోనే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ని... మరో కొత్త భామని బోయపాటి రంగంలోకి దింపుతున్నారు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇక బాలయ్య ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న రూలర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఆ వెంటనే బాలయ్య బోయపాటి సినిమా చేస్తాడు.
ఇక వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ కావడంతో మంచి కసిమీదున్న బోయపాటి ఎలాగైనా బాలయ్యతో హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. మరి ఈ సినిమాతో మళ్లీ బాలయ్య - బోయపాటిది హ్యాట్రిక్ కాంబినేషన్ అని ఫ్రూవ్ చేస్తారేమో ? చూడాలి.