ప్రభాస్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న భారీ ప్రొడ్యూసర్..?
ఇటువంటి నేపథ్యంలో ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయడానికి కన్ను వేసినట్లు...ప్రభాస్ డేట్స్ ఇస్తే ఇప్పటికిప్పుడు సినిమా చేయడానికి దిల్ రాజు రెడీ గా ఉన్నట్లు సమాచారం. కానీ ప్రభాస్ తాను నటించిన చివరి సినిమా సాహో అనుకున్నంతగా విజయాన్ని అందుకోకపోవడంతో కాస్త డీలా పడినట్లు స్టోరీలను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.
ఇటువంటి నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి మూవీ చేయబోతున్నట్లు అప్పట్లో టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా దిల్ రాజు ప్రభాస్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ నిసెట్స్ పైకి తీసుకురాబోతున్నట్లు టాక్ వస్తోంది. అయితే అధికారికంగా ఈ వార్త బయటకు రాకపోయినా కానీ ఇండస్ట్రీలో గట్టిగా వినబడుతోంది ఈ కాంబినేషన్లో త్వరలో సినిమా రాబోతున్నట్లు.