టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నందితశ్వేతా లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం అక్షర. బి. చిన్న కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన ‘కనులకు కాపాలాగా ఉంచా.. నీపేరు ప్రేమ దేశమా" అనే పాట కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మెలోడీ సాంగ్ లిరికల్ టీజర్ ని చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. `కనులను కాపలాగ వుంచా.. నీ పేరు ప్రేమ దేశమా..మనసుకు తలుపులన్ని తెరిచా.. నీ ప్రేమకింత అందమా..` అంటూ సాగే పాటను గేయ రచయిత బాలాజీ రాయగా అనుదీప్ దేవ్ ఆలపించిన ఈ పాట మెలోడియస్గా ఆకట్టుకుంటోంది. ఈ పాటలోఆర్టిస్టులందరినీ పరిచయం చేయడం ఆసక్తికరం. మధునందన్.. సత్య పాత్రలకు ఈ చిత్రంలో ఎంతో ప్రాధాన్యత ఉందని అర్థమవుతోంది.
బాలాజీ సాహిత్యానికి తగ్గ రీతిలో సురేష్ బొబ్బిలి అందించిన స్వరాలు పాటకు మరింత బలాన్ని చేకూర్చాయి. మంచి సాహిత్యం.. సంగీతంల కలబోతగా వున్న ఈ పాట సినిమాకు ప్లస్‌గా మారే అవకాశం వుంది. ఈ మెలోడీ అక్షర ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది అని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే గతంలో నందిత నటించిన చిత్రాలన్నీ దాదాపుగా అన్నీ హారర్ చిత్రాలే ఇక మరి ఈ అక్షర చిత్రం ఓ థ్రిల్లర్ కంటెంట్‌తో తెరకెక్కుతోందని సమాచారం. విద్యావ్యవస్థలో జరిగే అన్యాయాల పై ఓ టీచర్‌గా తాను వ్యవహరిస్తుంది అన్న నేపధ్యంలో కథ సాగుతుందని సమాచారం.