సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ల ఎఫైర్లు... హీరోయిన్లు, దర్శకుల ఎఫైర్లు చాలా కామన్. గత నాలుగైదు దశాబ్దాల నుంచి ఈ తంతు నడుస్తోంది. ఇక ఇప్పడు ఇది మరీ విచ్చలవిడి అయిపోయింది. ఒక్కో హీరోయిన్ ఒక్కో టైంలో ఒక్కో హీరోతో ఎఫైర్ పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తోంది. ఇక పెళ్లి అనే బంధానికి కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద విలువ లేకుండా పోయింది.
తాజాగా టాలీవుడ్లో ఓ యంగ్ హీరోయిన్, యంగ్ డైరెక్టర్ మధ్య తంతు హాట్ టాపిక్‌గా మారింది. ఆ యంగ్ డైరెక్టర్ ఆమెకు ఓ సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెకు గ్లామర్ ఇమేజ్ పెరగడంతో పాటు చాలా ఛాన్సులు వచ్చి పడ్డాయి. ఆ సినిమా షూటింగ్ టైంలోనే ఆ ఇద్దరి మధ్య గాడమైన ప్రేమబంధం ఏర్పడిందట. అయితే ఆ దర్శకుడికి అప్పటికే పెళ్లయ్యిందన్న విషయం తెలిసి కూడా సదరు హీరోయిన్ అతడికి దగ్గర అయ్యింది.
ఇక సదరు యంగ్ డైరెక్టర్ ఆ హీరోయిన్ను వదలడం లేదు. ఎక్కడ చూసినా వారే ఉంటున్నారు. వీళ్లిద్దరు తాజాగా ఓ హోటల్లో కార్యక్రమాల్లో మునిగి తేలుతుండగా సదరు డైరెక్టర్ భార్య అక్కడకు వచ్చిందట. వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో అక్కడ సదరు డైరెక్టర్‌కు, అతడి భార్యకు పెద్ద గొడవ కూడా జరిగిందట. సదరు డైరెక్టర్ మాత్రం తన భార్యకు ఏదోలా విడాకులు ఇచ్చేసి.. తనకు నచ్చిన ఆ హీరోయిన్నే పెళ్లాడాలనుకుంటున్నాడట.
అయితే ఇండస్ట్రీలో ఉన్న అతడి స్నేహితులు అయిన మరో దర్శకుడు, మరో రచయిత కలిసి హీరోయిన్లతో ఎఫైర్ ఉన్నా ఎప్పుడూ సంసారాన్ని, భార్యను నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారట. ఒక సీనియర్ హీరో కూడా ఆ యంగ్ డైరెక్టర్ కు అదే సలహా ఇచ్చాడట. ఇప్పుడు ఈ దర్శకుడు - హీరోయిన్ ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ అయ్యింది