చొట్ట బుగ్గల సుందరి తాప్సీ ఇటీవల ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ కోలీవుడ్ లో రజనీకాంత్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ ఢిల్లీ సుందరి తన ఇంటర్వూలో రజనీకాంత్ కంటే అజిత్‌కి తాను పెద్ద అభిమానిని అంటూ వ్యాఖ్యలు చేసింది. దీంతో రజనీకాంత్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాదు తమ హీరోను అవమానించేలా మాట్లాడినందుకు తాప్సీ సినిమాలను కోలీవుడ్ లో బాయ్ కాట్ చేస్తామని బెదిరించడంతో తాప్సీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఈ మేరకు ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ తాను రజనీసార్ గురించి అస్సలు ఏమి మాట్లాడలేదని, తన వ్యాఖ్యలను ఆ పత్రిక వారు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చింది. టైమ్స్ ఇంటర్య్యూలో తాలా కంటే అజిత్ కి పెద్ద అభిమానిని అని చెప్పానని, కానీ ఆ పత్రిక వారు తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకుని తాను అన్న మాటలు రజినీకాంత్ కు అంటగట్టారనీ గగ్గోలు పెడుతోంది తాప్సీ. తన దృష్టిలో తాలా అంటే అజిత్ ముద్దు పేరని దానిని Thalaivar(రజినీకాంత్) గా అర్థం చేసుకుని ఇంత హడావిడి చేసారని ఆమె వాదన.
ప్రస్తుతం తాప్సీకి టాలీవుడ్ కోలీవుడ్ లలో అవకాశాలు లేకపోవడంతో తన అదృష్టాన్ని బాలీవుడ్ లో వెతక్కుంటోoది ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్ లో ‘రన్నింగ్ షాది డాట్ కామ్' అనే సినిమాలో నటిస్తోంది. తాప్సీ చెప్పిన వివరణతో రజినీ అభిమానులు ఎంతవరకు కూల్ అవుతారో చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: