చిరంజీవి సినిమా కోసం భారీ సెట్ వేయబోతున్న కొరటాల!
సైరా సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి కొరటాలతో చేయబోయే సినిమా కోసం బరువు తగ్గే పనిలో ఉన్నట్లు సమాచారం. అయితే సైరా సినిమా కోసం ఎక్కువ టైం మెగాస్టార్ కేటాయించడంతో కొరడాలతో చేయబోయే సినిమాని అతి తక్కువ సమయంలోనే కంప్లీట్ చేసే విధంగా షెడ్యూల్ రెడీ చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా కనిపించనున్నారు. దీంతో దేవాదయ భూముల రక్షణ, నక్సలిజం వంటి అంశాలతో కూడిన కథ కావటంతో సింహాచలం ను పోలిన ఓ గుడి లో షూటింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
ఈ మేరకు గుడి సెట్ వేయటానికి అన్ని రకాల ప్రతిపాదనలు, లెక్కలు ఆర్ట్ డైరక్టర్ తో కలిసి ప్లాన్ చేసి ఈ సెట్ వెయ్యబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ లో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ సినిమాని వచ్చే వేసవికి విడుదల చేయడానికి సినిమా యూనిట్ మరో పక్క ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డబల్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం.