అనుష్క...అరుదైన ఫీట్....!!
ఆ తరువాత డైరెక్టర్ కోడి రామక్రిష్ణ అరుధతిలో జేజెమ్మగా కనిపించి వెండి తెరపై విశ్వరూపం ప్రదర్శించింది. ఇక అనుష్క రుద్రమదేవిగా, భాగమతిగా నటనకు కొత్త భాష్యం చెప్పారనే అనుకోవాలి. బాహుబలి లో దేవసేన పాత్రలో అనుష్కను తప్ప ఎవరినీ వూహించుకోవడం కష్టమే. అనుష్క లేటెస్ట్ గా నటించిన నిశ్శబ్దం మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. పాత కాలం నాటి హీరోయిన్ల అందం, అభినయంతో పాటు ఈ కాలం నాటి హీరోయిన్ల నాజూకుదనం, చొరవ అన్నీ కలగలసిన అరుదైన హీరోయిన్ గా అనుష్కను చెప్పుకోవాలి. సుదీర్ఘమైన కెరీర్ ఆమెది, అయినా టాప్ స్టార్. లేడీ ఓరెయెంటెడ్ మూవీస్ లో అనుష్క ఫస్ట్ చాయిస్. ఇప్పటికీ ఆమె కోసం దర్శకులు కధలను తయారుచేస్తున్నారంటే అనుష్క గ్రేట్ అనక తప్పదు. పుట్టిన రోజు సందర్భంగా అనుష్కను జేజేలు.