'సైరా' తో అక్కడ వాళ్ళ పని అయిపాయెరా....!!

Mari Sithara
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తదుపరి కొరటాల శివ దర్శకత్వంలో నటించబోయే 152వ సినిమా కోసం కొద్దిరోజులుగా తన బాడీని ని మంచి ఫిట్ గా తయారుచేసేందుకు పలు కసరత్తులు ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్లు టాక్. ఇకపోతే ఇటీవల మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాను అత్యంత భారీ ఖర్చుతో తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మించిన ఆయన తనయుడు రామ్ చరణ్, ఆ సినిమా ఓవర్ అల్ గా యావరేజ్ గా నిలవడంతో కొంతవరకు నష్టాలు చవిచూడడం జరిగింది. విజువల్ గా ఎంతో గ్రాండియర్ గా అద్భుతమైన సెట్టింగులతో, 

అత్యధికమంది పలు భాషలకు చెందిన దిగ్గజ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ అత్యద్భుతమైన నటనను ప్రదర్శించినప్పటికీ, సినిమాలో ఆకట్టుకునే కథ మరియు కథనాలు లేవని, చాలా మంది ప్రేక్షకులు సినిమాపై పెదవి విరిచారు. దర్శకుడు సురేందర్ రెడ్డి కథ కోసం తీసుకున్న పాయింట్ బాగుందని, అయితే దానిని స్క్రీన్ పై మరింత బాగా తీసివుంటే తప్పకుండా సినిమా హిట్ అయ్యేదని కూడా వారు అంటున్నారు. ఇకపోతే ఇటీవల దాదాపుగా చాలాచోట్ల పూర్తిగా క్లోజ్ అయిన ఈ సినిమా, కొన్ని ప్రాంతాల్లో పర్వాలేదనిపించినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగానే బయ్యర్లకు నష్టాలు తెచ్చిపెట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక కొందరు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న వివరాల ప్రకారం, 

బాలీవుడ్ లో ఈ సినిమా చాలా పేలవమైన ప్రదర్శన చేసిందని, అలానే ఓవర్ ఆల్ గా అక్కడ కేవలం రూ.8 కోట్ల రూపాయల కలెక్షన్ ని మాత్రమే రాబట్టగలిగినట్లు చెప్తున్నారు. ఇక ఈ సినిమాను అక్కడ భారీ ధరకు కొనుగోలు చేసిన ఫర్హాన్ అక్తర్ మరియు ఎక్సెల్ ఎంటెర్టైన్మెంట్ సంస్థలకు బాగానే నష్టాలు రావడంతో, వాళ్ళు చాలా వరకు ఢీలా పడ్డారని అంటున్నారు. అయితే సైరాకు అక్కడ తొలి రోజు మంచి టాక్ వచ్చినప్పటికీ, అదే రోజున హృతిక్ మరియు టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన వార్ సినిమా కూడా రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టడంతో, దాని ప్రభావం సైరాపై బాగానే చూపిందట. అంతేకాక దీనివలన రాబోయే రోజుల్లో బాలీవుడ్ లో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాల హక్కుల కొనుగోలుపై బయ్యర్లు కొంత ఆలోచన చేసే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం.....!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: