బోయపాటి -బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ హీరో?
సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటిస్తుండగా సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అంతేకాకుండా ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక వంటి వారు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల చేయటానికి సిద్దమవుతున్నారు. ఇదిలా ఉండగా రూలర్ సినిమా తర్వాత బాలకృష్ణ...బోయపాటి దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టనున్నట్లు సమాచారం. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా లెజెండ్ లాంటి సినిమాలు హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డులు సృష్టించాయి.
ఇటువంటి నేపథ్యంలో తాజాగా వీరిద్దరి కలయికలో మూడో సినిమా రాబోతున్న క్రమంలో ఆ సినిమాపై బాలకృష్ణ అభిమానులు ఇప్పటినుండి అంచనాలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్ట్ వార్త ఇండస్ట్రీలో బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ తో పాటు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. అయితే విలన్ రోల్ లో సంజయ్ దత్ నటిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు కూడా బోయపాటి జరిగినట్లు అంతా ఓకే అయినట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్.