మరింత ఆలస్యం కాబోతున్న చిరంజీవి కొరటాల సినిమా..?
అసలు విషయంలోకి వెళితే సైరా సినిమా తర్వాత వెంటనే కొరటాలతో చేయాల్సిన సినిమా స్టార్ట్ చేయాలని భావించిన చిరంజీవి కి ఆ సినిమాలో చిరంజీవి నటించిన డబుల్ రోల్ పాత్రలో ఒక పాత్రకి ఫుల్లుగా స్లిమ్ గా కనిపించాలని చిరంజీవికి కొరటాల చెప్పటంతో వెంటనే చిరంజీవి ఎక్సర్సైజులు చేయడం మొదలు పెట్టి బరువు తగ్గే పనిలో పడ్డాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ కల్లా చిరంజీవి బరువు తగ్గుతారని భావించిన పెద్ద చిరంజీవి బాడీ లో మార్పు లేకపోవడంతో కొరటాల ఇంకా బరువు తగ్గాలని చిరంజీవికి తెలియజేయడంతో సినిమా మరింత ఆలస్యం గా స్టార్ట్ కాబోతున్నట్లు జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతున్న ట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి.
ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా త్రిష ఎంపికైనట్లు సమాచారం. మొత్తం మీద జనవరి నుండి కొరటాల తీయబోయే సినిమా ప్రారంభించి ఎలాగైనా సమ్మర్ కి విడుదల చేయాలని చిరంజీవి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం చిరంజీవి బరువు తగ్గే పనిలో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్లు డైట్ ఫాలో అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.